ETV Bharat / city

'సాంకేతికతను అందిపుచ్చుకుని.. రైతులను ఆదుకునే విధానాలు తీసుకురావాలి' - విజయవాడలో పద్మవిభూషణ్‌ ఆచార్య ఎన్జీరంగా 120వ జయంతి వేకుడలు

ఆచార్య ఎన్జీరంగా 120వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో 'రంగా ఆశయాలు ఏ మేరకు సఫలీకృతమయ్యాయి' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తోన్న ప్రముఖులను సత్కరించారు.

ng ranga 120th birth anniversary celebrations
సాంకేతికతను అందిపుచ్చుకుని.. రైతులను ఆదుకునే విధానాలు తీసుకురావాలి
author img

By

Published : Nov 7, 2020, 11:04 PM IST

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని....రైతులను ఆదుకునే విధానాలను ప్రభుత్వాలు తీసుకురావాలని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆచార్య ఎన్జీ రంగా 120వ జయంతిని పురస్కరించుకుని... 'రంగా ఆశయాలు ఏ మేరకు సఫలీకృతమయ్యాయి' అనే పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ఈ పుస్తకాన్ని సీఏసీపీ మాజీ ఛైర్మన్‌, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సూర్యదేవర మహేంద్రదేవ్‌ ముంబయి నుంచి ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తోన్న ప్రముఖులను సత్కరించారు. ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌, అన్నదాత కార్యనిర్వాహక సంపాదకులు అమిర్నేని హరికృష్ణ, రైతు నేస్తం నిర్వాహకులు వై.వెంకటేశ్వరరావు, సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తోన్న బి.వి.రామాంజనేయులు, పర్యావరణ సహిత గ్రామీణాభివృద్ధి సాధన కోసం పాటుపడుతున్న డాక్టరు వై.వి. మల్లారెడ్డిని సత్కరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్జీరంగా చేసిన కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వ విధానాలపై నిశితంగా చర్చించారు. మన దేశంలో వ్యవసాయ సబ్సిడీలు ఎక్కువగా ఉంటున్నాయనే మాట వాస్తవం కాదని- చైనా, అమెరికా, యూరప్‌లలో ఎక్కువ మొత్తాలను సబ్సిడీలుగా రైతులకు అందిస్తున్నారని సీఏసీపీ మాజీ ఛైర్మన్‌ మహేంద్రదేవ్‌ అన్నారు.

దేశంలో వసాయ సంక్షోభం కొనసాగుతోందని... రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటికి కూడా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సూచనలు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యాన పంటలు.. తోట పంటలు సాగు చేస్తోన్న రైతులకు తగిన ఆదరణ వ్యవస్థ లేకపోవడం వల్ల గిట్టుబాటు ధర రావడంలేదని ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అమిర్నేని హరికృష్ణ అన్నారు. ఉద్యానరంగంలో పండించిన పంటలు త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున.. ఏటా 30 శాతం ఉత్పత్తులకు నష్టం కలుగుతోందని తెలిపారు. నిల్వ సదుపాయాలు..శీతల సౌకర్యాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవాలన్నారు. భరోసా లభించని కారణంగా దేశంలో ఓ సర్వే ప్రకారం 40 లక్షల మంది వ్యవసాయం నుంచి వైదొలిగారని వివరించారు.

సాంకేతికతను అందిపుచ్చుకుని.. రైతులను ఆదుకునే విధానాలు తీసుకురావాలి

ఇదీ చూడండి:

పీఎస్​ఎల్​వీ సీ-49 విజయంపై గవర్నర్ అభినందనలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.