ఓటు తొలగింపుపై ప్రజలు ఆందోళన చెందవద్దని...ఈ ఏడాది జనవరి నాటికి ఓటరు జాబితాలో ఉన్న వారి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త ఓటు నమోదు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1950కి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
కాలమానితో అవగాహన
18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కాలమాని(క్యాలెండర్)ని అందించేందుకు కూడా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓటు హక్కును వినియోగం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నైతికంగా ఓటు వేసేలా ఈ కాలమాని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీటిని గుర్తింపు కార్డుతో సహా ఓటరుకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
సత్వరమే సమాచారం
విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలకు సంబంధి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకే వారి కోసం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేక కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. ఓటు నమోదు చేసుకోవాలనుకు వారు ముందుగా ఫాం-6 దరఖాస్తులను నింపి వాటిని ఆయా కేంద్రాల్లో అందిస్తే....ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి ఓటరుకు వెంటనే సంబంధిత సమాచారాన్ని అందిస్తున్నారు.