విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్వే ను అధికారులు ప్రారంభించారు. దిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని నూతన రన్వే పై ల్యాండ్ చేయించారు. గతంలో 2 వేల 286 మీటర్ల రన్వే ఉండగా అదనంగా మరో 1,074 మీటర్లకు ఈ రన్వే ను విస్తరించారు.
రన్ వే అందుబాటులోకి రావటంతో బోయింగ్ విమానాలు 777, 747, ఎయిర్ బస్ సర్వీసుల రాకపోకలు సాగించవచ్చని విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు. దుబాయ్ నుంచి సర్వీసు నడవనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: