నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఆబ్కారీ విధానం అమల్లోకి రానుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 2,934 మద్యం దుకాణాలను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయని... తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో మద్యానికి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
ఇదీచదవండి