గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 116 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8 లక్షల 87 వేల 836కు చేరింది. ఇవాళ 127 మంది వైరస్ బారినుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 79 వేల 405కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు జరగలేదని.. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,153 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో 24 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 17, గుంటూరులో 13, విశాఖపట్నం 13, పశ్చిమగోదావరిలో 11, కడపలో 9, తూర్పుగోదావరిలో 9, కర్నూలులో 7, నెల్లూరులో 5, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 4, అనంతపురంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తెలింది. విజయనగరం జిల్లాలో కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: