కాకినాడ డీఆర్సీ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. వీధి రౌడీలు ప్రజా ప్రతినిధులు అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో డీఆర్సీ సమావేశం జరిగిన తీరే ఉదాహరణ అని అన్నారు.
వైకాపా అధినేత నుంచి ఎమ్మెల్యేల వరకూ అభివృద్ధితో సమాధానం చెప్పలేక నోటికి పని చెబుతున్నారని లోకేశ్ విమర్శించారు. సొంత పార్టీ నాయకులే జరుగుతున్న అవినీతిని ఎండగడుతుంటే.. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెదేపా ఎమ్మెల్యే జోగేశ్వరరావుని తోసేశారని మండిపడ్డారు. మరో ఎమ్మెల్యే చినరాజప్పని నోరుమూసేయ్ అంటూ బెదిరించడం వైకాపా నాయకుల రౌడీయిజాన్ని మరోసారి బయటపెట్టిందని ధ్వజమెత్తారు. ఇలాంటి రౌడీల పాలనలో ప్రజల పరిస్థితి తలచుకుంటే బాధేస్తోందన్నారు. కాకినాడ డీఆర్సీ సమావేశం వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి..