మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడమనేది.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని నారా లోకేశ్ విమర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి పారాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.
తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తక్షణమే బెడ్లు, ఆక్సిజన్, మందులు కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత.. ఇద్దరు మృతి