ETV Bharat / city

'రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు' - రైతుల ఆత్మహత్యలపై మండిపడ్డ నారాలోకేశ్

మనకు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. వైకాపా ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. జగన్ పాలనలో 753 మంది రైతులు బలయ్యారని ఆవేదన చెందారు.

nara lokesh fires on ycp over suicide attempts of farmers in state
'రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు': లోకేశ్
author img

By

Published : Jan 20, 2021, 12:41 PM IST

"సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు.. 753 మంది రైతులు బలైపోయారు" అని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. ఇన్సూరెన్స్ కట్టడం దగ్గర నుంచి మద్దతు ధర కల్పించడం వరకూ.. రైతుల్ని సీఎం జగన్ ఘోరంగా మోసం చేశారని దుయ్యబట్టారు.

రైతుల ఆత్మహత్యలు కంటతడి పెట్టిస్తున్నాయి

కృష్ణా జిల్లా చందర్లపాడులో అప్పుల బాధ భరించలేక.. మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మినారాయణ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటే.. కంట కన్నీరు ఆగడం లేదని ఆవేదన చెందారు. వైకాపా అభిమాని అయిన.. కౌలు రైతు లక్ష్మీనారాయణ, జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతులు పడుతున్న కష్టాలను వివరిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.