ETV Bharat / city

'తాడేపల్లి ప్యాలెస్​లో జగన్​ రెడ్డి ఫిడేలు వాయించుకుంటున్నారా?' - జగన్​పై నారా లోకేశ్ కామెంట్స్

రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకి పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

'తాడేపల్లి ప్యాలెస్​లో జగన్​ రెడ్డి ​ ఫిడేలు వాయించుకుంటున్నారా?'

author img

By

Published : Dec 15, 2020, 3:50 PM IST

అన్నదాతలకు భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ మంత్రులు మాట్లాడటం బాధ్యతారాహిత్యమని నారా లోకేశ్‌ మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన కౌలు రైతు ఓలేటి ఆదిశేషు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాధాకరమన్నారు. తాడేపల్లి ప్యాలస్​లో ఫిడేలు వాయించుకుంటున్న జగన్ రెడ్డి బయటకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్​లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని లోకేశ్‌ అన్నారు.

ఇదీ చదవండి: రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.