ETV Bharat / city

Children's Day Wishes : ప్రపంచంలో అత్యంత విలువైన సంపద బాలలే - చంద్రబాబు

చిన్నారులందరికీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి రోడ్డున పడేలా ఉందన్న నేతలు.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు.

Children's Day Wishes
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
author img

By

Published : Nov 14, 2021, 1:08 PM IST

చిన్నారులందరికీ తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్తమానాన్ని త్యాగం చేస్తేనే.. మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చెప్పారను ఆయన గుర్తు చేశారు. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల కోసం విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని విమర్శించారు.

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘భారత యాత్ర’ చేపట్టిన కైలాశ్‌ సత్యార్థితో పాటుగా రాష్ట్ర వీధుల్లో పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదకు వస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు బాలలేనని, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత అందరిదని చంద్రబాబు స్పష్టంచేశారు.

పిల్లల చదువు ప్రభుత్వానికి భారమైంది - లోకేశ్
బడి కోసం, భవిష్యత్తు కోసం పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళను కొట్టిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పిల్లలకు ఏ మేలు చేసినా అది మొత్తం సమాజానికి చేసినట్లేనన్న గౌతమ బుద్ధుని మాటలు గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వానికి పిల్లలను చదివించడమే మోయలేనంత భారమైపోయిందని ఆరోపించారు. బాల్యం దాటకుండానే మనమంతా పెద్దవాళ్ళం అయిపోయామా? అని లోకేశ్ ప్రశ్నించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా.. పిల్లల భవిష్యత్తు పట్ల ఎల్లప్పుడూ బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : health grant: రాష్ట్రానికి రూ.488 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.