ETV Bharat / city

కరోనా దెబ్బతో క్షౌరశాలల్లో మారిన ప్రమాణాలు - రాష్ట్రంలో నాయీ బ్రహ్మణుల వార్తలు

కరోనా దెబ్బతో కటింగ్‌ స్టైల్ మారింది. కత్తెర కొత్త పుంతలు తొక్కుతోంది. మహమ్మారి వ్యాప్తి నుంచి సెలూన్ నిర్వాహకులు తమను తాము కాపాడుకుంటూనే... వినియోగదారుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత దుకాణాలు తెరిచిన నాయీబ్రాహ్మణులు... ఒకసారి వాడిపారేసే సామగ్రికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ క్షవరాలు చేస్తున్నారు.

nai-brahmins-who-shave-with-protective-measures
కరోనా దెబ్బతో క్షౌరశాలల్లో మారిన ప్రమాణాలు
author img

By

Published : May 26, 2020, 11:04 PM IST

లాక్‌డౌన్‌ వెసులుబాటు తర్వాత వివిధ వృత్తుల ప్రమాణాలు మారాయి. క్షౌరశాలలు అధునిక పోకడలతో ఆకట్టుకుంటున్నాయి. కరోనా వ్యాప్తికి సెలూన్లు ప్రధాన కేంద్రాలవుతాయనే ప్రచారానికి చెక్ పెడుతూ విజయవాడ నాయీబ్రాహ్మణులు సేవలందిస్తున్నారు. 2 నెలలకు పైగా తమ కడుపుకొట్టిన మహమ్మారి నుంచి వ్యక్తిగత రక్షణ పొందుతూ వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా... క్షవరాలు చేస్తున్నారు. వాడిపారేసే సామగ్రికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నమ్ముకున్న వృత్తిలో నూతనత్వంతో ముందుకు సాగుతున్నారు.

కరోనా దెబ్బతో క్షౌరశాలల్లో మారిన ప్రమాణాలు

స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతి

సెలూన్లకు వచ్చే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్కాన్ ద్వారా పరీక్షించి నిర్వాహకులు అనుమతిస్తున్నారు. రద్దీ, వేచి ఉండటం లాంటి ప్రక్రియ లేకుండా... వినియోగదారుల ఫోన్ నెంబర్లు తీసుకుని టైమ్ స్లాట్‌లు కేటాయిస్తున్నారు. 10నిమిషాల ముందుగా వినియోగదారుడికి ఫోన్ చేసి రమ్మంటున్నారు. సెలూన్లలో వాడే టవళ్లు, ఇతర కత్తెర సామగ్రి ఒకసారి వాడి పారేసే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 800రూపాయలు విలువ చేసే పీపీఈ కిట్లను క్షురకులు ధరిస్తున్నారు. వీటికి అదనంగా మరో 120 రూపాయలు విలువ చేసే ఫేస్ షీల్డ్, మాస్క్, గ్లౌజులు వాడుతూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

క్షౌరశాలల్లో రక్షణ చర్యలతో తమలో నెలకొన్న ఆందోళన తొలగిపోయిందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా ప్రస్తుతానికి వినియోగదారుల నుంచి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని సెలూన్ల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ పట్ల ఉదారతతో... అద్దె చెల్లింపులు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.