నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి నీరు రావడంతో 4 క్రస్ట్ గేట్లు 5అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 92,346 క్యూసెక్కులు కాగా... అవుట్‌ఫ్లో 92,346 క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు.
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 312.03 టీఎంసీలకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు... ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది.
ఇదీ చదవండి: అమరావతి ఐకాస జైల్ భరో...అడ్డుకుంటున్న పోలీసులు