ETV Bharat / city

జోరుగా ప్రచారం.. గడపగడపకు వెళ్లి ఓట్లు అడుగుతున్న నేతలు, అభ్యర్థులు

ప్రచారానికి ఇక రెండే రోజులు మిగిలిన వేళ మున్సిపాలిటీల్లోనూ ....ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, విపక్షాల నేతలు పోటీపడుతున్నారు. గడపగడపకూ వెళ్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

election campaign
జోరుగా ప్రచారం
author img

By

Published : Mar 7, 2021, 5:24 AM IST

జోరుగా ప్రచారం

గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్....వైకాపా తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం తరపున ప్రచారం చేసిన ఆ పార్టీ నేత ఆలపాటి రాజా.... రెండేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామలో పర్యటించిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రకాశం జిల్లా చీరాలలో..ఎమ్మెల్యే కరణం వర్గీయులు వైకాపా తరపున బరిలో నిలవగా... మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు రెబెల్స్‌గా పోటీచేస్తున్నారు. ఇరు వర్గాలూ పోటీపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కనిగిరిలో తెదేపా అభ్యర్థి ఒకరు దేవుడికి మొక్కులు చెల్లించుకోగా....వైకాపా అభ్యర్థి మహిళల దగ్గరకు వెళ్లి కాసేపు పువ్వులు గుచ్చి....తమకే ఓటేయాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే అశోక్ ….ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైకాపా తరఫున.....ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు, వెంకట చిన అప్పల నాయుడు ప్రచారం చేశారు. పార్వతీపురంలో అరకు ఎంపీ మాధవి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో...తెదేపా నేత అయ్యన్నపాత్రుడు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అనిమిరెడ్డి వారి వీధిలో వైకాపా తలపెట్టిన ప్రచారంలో...అపశ్రుతి చోటుచేసుకుంది. తాటాకు ఇంటిపై బాణాసంచా పడి అగ్నిప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తునిలో పర్యటించిన ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్‌....ఈ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందన్నారు.

రాయలసీమలో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా సీనియర్ నాయకుడు వెంకట రాముడు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు.. గడపగడపకు తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గుంతకల్లులో తెదేపా తరఫున జేసీ పవన్‌ ఇంటింటికీ తిరిగారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని వార్డుల్లో తెదేపా జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర ప్రచారం చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రోజా దంపతులు ప్రచారం నిర్వహించారు.నెల్లూరు జిల్లా నాయుడుపేటలోనూ తెదేపా, వైకాపా మధ్య పోటాపోటీగా ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి:

ఇరు వర్గాల ఘర్షణ..20 గుడిసెలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.