ETV Bharat / city

ఉద్యోగులపై విచారణకు పురపాలక శాఖ ఆదేశం - Municipal department orders probe into 10 employees

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Municipal department orders probe into 10 employees
ఉద్యోగులపై విచారణకు పురపాలక శాఖ ఆదేశం
author img

By

Published : Feb 16, 2021, 11:52 AM IST

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. పది మంది ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16 సంవత్సరంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ విచారణకు ఆదేశించింది. సత్తెనపల్లి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కే.శ్రీనివాసరావు, విజయవాడ టౌన్ ప్లానింగ్‌ అధికారి మోహన్‌బాబు, గుంటూరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మల్లికార్జునపై విచారణకు ఆదేశించింది. మంగళగిరి మున్సిపాలిటిలో పనిచేస్తున్న దుర్గారావు, విజయలక్షి, క్లర్కు శివనాగేశ్వరరావు, తాడేపల్లి మున్సిపాలిటిలో ఆర్‌ఐ గా చేస్తున్న మధుకిరణ్‌పై విచారణకు ఆదేశించింది. విశాఖ జోనల్‌ కమిషనర్‌ ఎం. వెంకటేశ్వరరావు, మంగళగిరి మున్సిపల్‌ కమిషనర్‌ ఎంవి నాగేశ్వరరావు, మంగళగిరి మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ టీవీ రంగారావుపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ.. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు

ఇదీ చదవండి:

ఆంగ్లమాధ్యమంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.