రాష్ట్రవ్యాప్తంగా మండలాధ్యక్షులు(MPP ELECTION), ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎంపీటీసీ(MPTC) ఎన్నికల ఫలితాలు విడుదలైనందున... తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు ఎస్ఈసీ(SEC) అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్లను పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నామినేషన్లు ఉపసంహరణకు వీలు కల్పించారు.
ఆ తర్వాత నుంచి కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి..
iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నారు..!'