MP Raghurama on removing gautam sawang: ఐదు వందల కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి తగులబెట్టిన గౌతమ్‌సవాంగ్‌ను సన్మానిస్తారని భావిస్తే.. ఏకంగా ఉద్యోగమే తీసివేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న వైకాపా నాయకుల ఒత్తిడి వల్లే ఆయన్ను తొలగించారన్న ప్రచారం నడుస్తోందన్నారు. సవాంగ్‌ను తప్పించడానికి కారణాలేంటో ప్రభుత్వం చెప్పాలన్నారు.
జగన్ గతంలో.. సవాంగ్, ఎల్వీ సుబ్రమణ్యం రెండు కళ్లన్నారు. గౌతమ్ సవాంగ్ మంచి పని చేస్తే ఎందుకు ఇలా చేశారు. గంజాయిని తగలబెట్టారని ఫిర్యాదు వచ్చిందనే తీసేశారా? కస్టడీలో నాపై దాడికి సంబంధించి కేంద్రానికి లేఖ రాశా. నా లేఖ ప్రభావం సవాంగ్‌ను ఒత్తిడికి గురిచేసి ఉండవచ్చు. యూపీఎస్సీకి మూడు పేర్లు షార్ట్ లిస్ట్ చేసి పంపారు. 3 పేర్లలో రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ఉందో.. లేదో చూడాలి. సవాంగ్‌ను ఎందుకు తీసేశారో యూపీఎస్సీకి ఏం చెబుతారో? నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు.
- రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ
ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఏం చేస్తోరో..?
నిన్న కృష్ణలంక పీఎస్‌లో అర్ధరాత్రి ఒక ఎంపీ హల్‌చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై డీజీపీ ఏం చేస్తారో చూడాలని రఘురామ అన్నారు.
వివేకా హత్య కేసులో మంచి తీర్పు వచ్చింది
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడంపై కొందరు పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టులో మంచి తీర్పు వచ్చిందని.. ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరో అప్రూవర్‌గా మారితే వాళ్ల బాధేంటో అర్థం కావట్లేదన్నారు.
వారిని లోపలికి రానివ్వలేదు..
చిరంజీవి, మహేశ్ కార్లను కనీసం లోపలికి రానివ్వలేదు. మంచు విష్ణు కారు లోపలికి అనుమతిచ్చి.. భోజనం పెట్టి పంపారని రఘురామ తెలిపారు.
ఇదీ చదవండి:
DGP meets CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి