సినిమా ధియేటర్లు, మద్యం దుకాణాల వద్ద లేని కరోనా.. గణేశ్ మండపాల వద్దే వస్తోందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వేలమందితో మంత్రులు సభలు నిర్వహిస్తే రాని వైరస్.. వినాయక చవితి జరుపుకుంటేనే వస్తుందా అని నిలదీస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. నిబంధనల పేరిట హిందూ పండుగలకు అనుమతివ్వకపోవడం సరికాదన్న రఘురామ.. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకొని కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కరోనా నిబంధనల పేరిట హిందువుల పండగలకే ఆంక్షలు ఎందుకు?. ఇస్లాం, క్రైస్తవ పండగలకు కరోనా నిబంధనలు వర్తించవా?. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో అతిపెద్ద విగ్రహం పెట్టి పూజలు చేయట్లేదా?. రాష్ట్ర ప్రజలంతా హైదరాబాద్ వెళ్లి గణేశుడికి పూజలు చేయాలా. వినాయక చవితి ప్రాశస్త్యం గురించి సీఎంకు ఎవరైనా చెప్పండి. తితిదే కల్యాణ మండపాల విషయంలో పునరాలోచన చేయాలి.- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి..