ETV Bharat / state

రాజమహేంద్రవరంలో మెగా పవర్ ఈవెంట్ - ఒకే స్టేజ్‌పై బాబాయ్‌-అబ్బాయ్‌ సందడి - GAME CHANGER PRE RELEASE EVENT

రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజర్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ - ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

game_changer_pre_release_event
game_changer_pre_release_event (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 4:49 PM IST

Updated : Jan 4, 2025, 6:44 PM IST

Game Changer Pre Release Event in Rajamahendrawaram: రాజమహేంద్రవరంలో గేమ్‌ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందడి నెలకొంది. తమ అభిమాన నటుడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Global star Ram Charan) నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ చిత్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూసిన మెగా అభిమానుల ఎదురుచూపులకు జనవరి 10న తెరపడనుంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఇవాళ రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం-వేమగిరి జాతీయ రహదారి పక్కన భారీస్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) కూడా హాజరుకానున్న నేపథ్యంలో అటు అధికారులు, ఇటు చిత్ర బృందం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు లక్ష మంది అభిమానులు వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి: ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ పరిశీలించారు. అంతే కాకుండా భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో మాట్లాడారు. అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచించారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాగా బాబాయ్‌ - అబ్బాయ్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారని ఇది అభిమానులకు కన్నులపండుగ అవుతుందని మంత్రి తెలిపారు.

రాజమహేంద్రవరంలో మెగా పవర్ ఈవెంట్ - ఒకే స్టేజ్‌పై బాబాయ్‌-అబ్బాయ్‌ సందడి (ETV Bharat)

Actor Ram Charan 256 Feet Cutout: కాగా ఇటీవల విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. గేమ్ ఛేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డను అందుకున్నారు. ఈ కటౌట్​కు హెలికాప్టర్ ద్వారా పూలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు.

'మీరు ఓజీ అని అరుస్తుంటే, నన్ను బెదిరిస్తున్నట్లు ఉంది!'- OGపై పవన్ రియాక్షన్

'ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకా టైమ్ ఉంది- థియేటర్లో అల్లాడిద్దాం'- OG మేకర్స్

Last Updated : Jan 4, 2025, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.