విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ... ముఖ్యమంత్రి జగన్(jagan)కు ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ(RRR Letter) రాశారు. అన్ని రాష్ట్రాలు... బోర్డు పరీక్షల రద్దు చేశాయని.. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులల్లో అనిశ్చితి నెలకొందన్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రఘురామ నాలుగో లేఖ రాశారు.
కొవిడ్ బారినుంచి పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో పరీక్షల రద్దుపై ఈ నెల 1న ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలని స్థిర నిర్ణయంతో ఉందని రాఘురామ పేర్కొన్నారు. కరోనా వేళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దు అన్నారు.
ఇదీ చదవండి..
Supreme Court: ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రానిదే బాధ్యత: సుప్రీంకోర్టు