కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానన్న జగన్ రెడ్డి ఇప్పుడు మాటమార్చారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. విభజన హామీల అమలుకు ఎందుకు వైకాపా ఎంపీలు నిధులు రాబట్టలేకపోయారని ప్రశ్నించారు. వైకాపా ఎంపీలు ఉండేది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికా లేక జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కేసుల నుంచి బయటపడటానికి బేరాలు చేయడానికా అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై ఎందుకు నోరు మెదపడం లేదని కేశినేని నాని నిలదీశారు. దిల్లీ చుట్టూ పదేపదే ప్రదిక్షణలు చేసే జగన్ రెడ్డి తన వ్యక్తిగత కేసుల మాఫీ కోసమేనని ఆక్షేపించారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ రెడ్డి 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను దిల్లీలో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం