ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి, ఇక్బాల్‌

ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలకు వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ల పేర్లను ముఖ్యమంత్రి జగన్‌ ఖరారు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి, ఇక్బాల్‌
author img

By

Published : Aug 11, 2019, 6:21 AM IST

రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలకు వైకాపా అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ల పేర్లను ముఖ్యమంత్రి జగన్‌ ఖరారు చేశారు. శాసనసభలో వైకాపాకి ఉన్న సంఖ్యాబలం రీత్యా మూడు ఎమ్మెల్సీ స్థానాలూ ఆ పార్టీకే దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్‌ సమాలోచనలు చేశారు. మరో స్థానానికి చల్లా రామకృష్ణారెడ్డితో పాటు, మరికొందరు నాయకుల పేర్లు పరిశీలించినట్టు తెలిసింది. మూడో ఎమ్మెల్సీ స్థానం రామకృష్ణారెడ్డికి దక్కేందుకే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చూడండి-చిత్తు కాగితాల్లో దొరికిన వెండి కిరీటం

Intro:AP_ONG_81_10_ACCIDENT_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు విద్యుత్ స్టేషన్ సమీపం లో ఆటో...ద్విచక్ర వాహనం డీ కొన్నాయి. ఈ ప్రమాదం లో సాల్మన్ రాజు అనే వ్యక్తి మృతి చెందగా అతని కుమార్తె, కుమారుడికి గాయాలయ్యాయి. వారిద్దరినీ మార్కాపురం లోని జిల్లా వైద్యశాలకు తరలించారు. పెద్దారవీడు నుండి స్వగ్రామమైన కొత్తపల్లి కి ద్విచక్ర వాహనం పై వెళుతుండగా సమీపం లోని ములమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఘటన లో సాల్మన్ రాజు కాలు నుజ్జు నుజ్జు కావడం తో వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాల్మన్ రాజు మద్యం సేవించి ద్విచక్ర వాహనం పై వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు.Body:ఒకరు మృతి.Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.