తెదేపా హయాంలో సంబంధిత మంత్రులు, అధికారులు అనేకసార్లు తమతో సమావేశమై విద్యారంగ సమస్యలపై చర్చించారని ఎమ్మెల్సీ రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. జులై 2018 నుంచి ఐదు పీఆర్సీ బకాయిలతో పాటు, పీఎఫ్ రుణాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లోనూ జాప్యంపై అసంతృప్తి చెందారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీఏల చెల్లింపుపై చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడెందుకు పట్టించకోవడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం తలపెట్టిన నాడు - నేడుతో కరోనా బారిన పడి, రాజకీయనేతల ఒత్తిడి భరించలేక ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: