ETV Bharat / city

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఓ స్థానంలో తెరాసకు ఆధిక్యం

తెలంగాణలో నిర్వహించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌ ఫలితాలు వెలువడగా... హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో లెక్కింపు కొనసాగుతోంది.

mlc-first-round-results-released-counting-continued

author img

By

Published : Mar 18, 2021, 6:56 AM IST

తెలంగాణలో నిర్వహించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి. 16,130 ఓట్లతో తెరాస సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలిస్థానంలో ఉన్నారు. 12,046 ఓట్లతో తీన్మార్‌ మల్లన్న రెండో స్థానంలో, 9,080 ఓట్లతో తెలంగాణ జనసమితి తరఫున పోటీచేసిన కోదండరాం మూడో స్థానంలో, 6,615 ఓట్లతో భాజపా తరుఫున పోటీచేసిన ప్రేమేందర్‌రెడ్డి నాలుగోస్థానంలో, 4,354 ఓట్లతో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన రాములునాయక్‌ ఐదో స్థానంలో, 1,123 ఓట్లతో రాణిరుద్రమరెడ్డి ఆరో స్థానంలో, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఏడో స్థానంలో, 1,008 ఓట్లతో జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొత్తం 3,85,996 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. తొలిరౌండ్‌లో 56,003 ఓట్లను లెక్కించగా, 3,151 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో లెక్కింపు...

హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో లెక్కింపు ఆరంభమైంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభించాల్సిన తపాలా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పది గంటలకు ప్రారంభమైంది. ఆతర్వాత బ్యాలెట్‌ ఓట్లను కట్టలు కట్టడం మొదలుపెట్టి రాత్రి పది గంటలకు పూర్తి చేశారు.

799 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాెట్‌ పత్రాలను 8 హాళ్లలో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక, ఎన్నికల పరిశీలకులు హర్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తెరాస తరఫున వాణీదేవి, కాంగ్రెస్‌ నుంచి చిన్నారెడ్డి, తెదేపా నుంచి రమణ, నాగేశ్వర్‌ తదితర 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానంలో 3,57,354 ఓట్లు పోలైన విషయం తెలిసిందే.

ఓట్లు తక్కువ ఉన్నాయంటూ ఆందోళన...

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం స్థానానికి సంబంధించి మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కేంద్రంలోని 175వ నంబరు పోలింగ్‌ బూత్‌లో 603 ఓట్లు పోలైతే అందులో 31 ఓట్లు తక్కువగా ఉన్నాయంటూ అక్కడి ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయగా మరోసారి బ్యాలెట్‌ పత్రాలను పరిశీలిస్తామని ఆర్వో హామీ ఇచ్చారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పోలింగ్‌ కేంద్రం బ్యాలెట్‌ బాక్స్‌లో ఒక బ్యాలెట్‌ ఎక్కువగా వచ్చిందని ఏజెంట్లు ఫిర్యాదు చేయగా అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆరో నెంబరు గదిలోకి తెచ్చిన కొన్ని బ్యాలెట్‌ పెట్టెలకు సీల్‌ లేదంటూ తెరాసయేతర పార్టీల ఏజెంట్లు ఉదయం లెక్కింపు కేంద్రంలో ఆందోళన చేశారు. కేంద్రం అంతా సీసీ కెమెరాలు ఉన్నాయని ఎక్కడా పొరపాటు జరగలేదని ఆర్వో ప్రశాంత్‌ పాటిల్‌ నచ్చజెప్పగా ఆందోళన సద్దుమణిగింది.

బ్యాలెట్‌ బాక్సుల్లో క్షేత్రసహాయకుల లేఖలు...

హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి లెక్కింపు సందర్భంలో ఓ బ్యాలెట్‌ పెట్టెలో తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఉపాధిహామీ క్షేత్రసహాయుడు ఒకరు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రాసిన లేఖ బయటపడింది. ఇలాంటివి వికారాబాద్‌ జిల్లా పరిధిలోని పూడూరు-251 పోలింగ్‌ బూత్‌లో మూడు, కోస్గి-158 పోలింగ్‌ బూత్‌లో రెండు లేఖలను గుర్తించినట్లు తెలిసింది.

అధికారులు మాత్రం దీన్ని కొట్టేశారు. మహబూబ్‌నగర్‌, గద్వాల్‌ జిల్లాలకు చెందిన రెండు పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ పెట్టెల్లో ఓట్ల లెక్క తక్కువగా కనిపించినట్లు ఆరోపణలొచ్చాయి. కొన్ని బ్యాలెట్‌ డబ్బాల తాళాలు తెరుచుకోకపోవడంతో ఏజెంట్ల సమక్షంలో పగలగొట్టినట్లు స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద అప్రమత్తత అవసరం: కోందడరాం

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, అల్లర్లు సృష్టించి ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అధికార పార్టీ చూస్తోందని కోదండరాం ఆరోపించారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.