దళితుడు, ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీగా వైకాపా నిలబెడితే.. ఆయనను అవమానించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ? అని ప్రశ్నించారు. ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి సేవ చేస్తుంటే ఆ వృత్తిని అవమానిస్తారా ? అని నిలదీశారు. కులవృత్తులను అవమానిస్తూ ఫ్యూడల్ మనస్తత్వాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారని ఆక్షేపించారు.
సీఎం జగన్ దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని మేలు జగన్ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. దళితులపై దాడులు జరిగితే ఎన్నడూ లేని విధంగా బాధ్యులపై చర్యలు తీసుకున్నది వైకాపా ప్రభుత్వమేనన్నారు.
ఇదీచదవండి