వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి అధికారం దూరం చేసేందుకు ప్రజలకు ఎలాంటి సెక్షన్లతో పనిలేదని ఎమ్మెల్సీ చెంగల్రాయుడు వ్యాఖ్యానించారు. అమరావతే రాజధాని అనే అంశంపై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని గతంలో రఘురామ కృష్ణరాజు చేసిన సవాల్‌కు సీఎం జగన్ సిద్ధమా ? అని ప్రశ్నించారు.
నిజంగా రఘురామరాజుపై కక్ష తీర్చుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తే..,ఆయన విసిరిన సవాల్‌కు కట్టబడాలన్నారు. చేతనైతే మూడు రాజధానుల అంశంపై పోటీచేసి గెలవాలి కానీ అక్రమ అరెస్టులతో పిరికి చర్యలు తగవన్నారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు న్యాయస్థానంలో నిలబడవని చెంగల్రాయుడు పేర్కొన్నారు.
ఇదీచదవండి