ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. విధానాలతో ఐఏఎస్ అధికారులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఎమ్మెల్సీ అశోక్బాబు మండిపడ్డారు. జగన్ పరిపాలనలో వేధింపులు పరిపాటిగా మారాయని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
"కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఒకేసారి ఐదుగురు అధికారులకు శిక్ష, జరిమానా విధించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు. జగన్ రెడ్డి నిర్ణయాలకు తలూపే అధికారులకు జైలు శిక్షలు, జరిమానాలు సాధారణమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో దాదాపు 200కేసుల్లో ప్రతికూల తీర్పులొచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు రోజుకొకరు చొప్పున కోర్టు మెట్లెక్కుతున్నారు. చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన ఐఏఎస్ అధికారుల సంఘం.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు. బ్యాచ్ టాపర్గా నిలిచిన ముత్యాలరాజు, అత్యంత సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ లాంటి అధికారులకు జైలుశిక్ష పడటం వారి కెరియర్కే అతిపెద్ద మచ్చ. ఈ పరిస్దితికి కారణం ఎవరో ఆ అధికారులు ఆలోచించుకోవాలి. రాష్ట్ర పరిణామాలపై జాతీయస్థాయి ఐఏఎస్ అధికారుల సంఘం మాట్లాడాల్సిన అవసరం ఉంది" అని ఆశోక్బాబు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి...