ప్రజా సమస్యలపై మాట్లాడిన ఎంపీ రఘురామ కృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించారంటూ.. ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించకుండా.. కోర్టు ఆదేశాలకు విరుద్దంగా దొడ్డిదారిన రఘురామను జైలుకు తరలించారని.. ఇది దురుద్దేశపూరితమని ఎమ్మెల్సీ మంతెన మండిపడ్డారు. తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీకి ఏదైనా అపకారం జరిగితే.. అందుకు ముఖ్యమంత్రి, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, జైలు సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక, అరాచక, హింసాత్మక చర్యలను… ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు నిరసించాలని పిలుపునిచ్చారు. లేకపోతే… ఎవరి ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. పార్లమెంట్ సభ్యునికే రక్షణ లేకపోతే… జగన్ పాలనలో సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు, ప్రజాకోర్టులో ఈ నేరాలకు తగిన శిక్ష తప్పదని పాలకులు గుర్తించాలని హితవు పలికారు. వివేకా హత్య కేసులో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయని ప్రభుత్వం.. రాజకీయ కక్షతో రాజ్యాంగ విధానాన్ని కాలరాస్తూ… ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. అంతర్వేది ఘటనలో నిందితులు ఎవరనేది ఇప్పటికీ తెలియదలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: