ETV Bharat / city

పోలవరంపై 2017-18 నాటి ధరలకు అంగీకరించాం: కేంద్ర జలశక్తి శాఖ - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 55 వేల 548 కోట్ల వ్యయానికి ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు.. 17,327 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. త్వరలో నా బార్డు నుంచి 2,234 కోట్లు విడుదల అవుతాయని పేర్కొంది. ఈ మేరకు వార్షిక పురోగతి నివేదికలో కేంద్ర జలశక్తి శాఖ వివరాలు వెల్లడించింది.

పోలవరంపై 2017-18 నాటి ధరలకు అంగీకరించాం: కేంద్ర జలశక్తి శాఖ

author img

By

Published : Dec 27, 2020, 4:23 AM IST

2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి... కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపింది. 55వేల 548.87 కోట్ల రూపాయల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. 2020 ఏడాది పురోగతి నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని.. 2014 మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని వార్షిక నివేదికలో తెలిపింది. 2454 మీటర్ల ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం, 1128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు.. ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది.

2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికి సంబంధించిన 100 శాతం నిధులను కేంద్రమే సమకూర్చుతుందని... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరపున.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందని నివేదికలో వెల్లడించింది. 2017-18 నాటి ధరల ప్రకారం.. ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం 55వేల 548.87 కోట్ల రూపాయలు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8614.16 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసిందని, అందులో.. 1850 కోట్ల రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి విడుదల అయ్యాయని జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. దీనికి తోడు.. 2020-21 ఏడాదిలో 2234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కూడా.. జలశక్తి శాఖ తెలిపింది. త్వరలో ఈ నిధుల నాబార్డు ద్వారా విడుదల కానున్నట్లు వెల్లడించింది. 2020 మార్చి 31 వరకు జరిగిన పనులకు గాను 17,327 కోట్లు ఖర్చు అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.