ETV Bharat / city

గుత్తాజ్వాల అకాడమీ ఆఫ్​ ఎక్సలెన్స్ ప్రారంభం

author img

By

Published : Nov 3, 2020, 12:00 AM IST

హైదరాబాద్​ మొయినాబాద్ మండలంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల నెలకొల్పిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్​ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్​ ప్రారంభించారు.

గుత్తాజ్వాల అకాడమీ ఆఫ్​ ఎక్సలెన్స్ ప్రారంభం
గుత్తాజ్వాల అకాడమీ ఆఫ్​ ఎక్సలెన్స్ ప్రారంభం

హైదరాబాద్​ మొయినాబాద్​ మండలంలో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల నెలకొల్పిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్​ ఎక్సలెన్స్​ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​... మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న పాలసీ క్రీడాకారులను, శిక్షకులను ప్రోత్సహించే విధంగా ఉంటుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. చిన్న చిన్న దేశాల నుంచి వస్తున్న క్రీడాకారులు విజేతలుగా నిలుస్తున్నారని... అలాంటి ప్రతిభావంతులు మన దేశంలో తయారవ్వాలని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులతో పాటు శిక్షకులు, సహాయక సిబ్బందిని గుర్తించినప్పుడే విజేతలు పుట్టుకొస్తారన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్న గుత్తా జ్వాల అకాడమీతో... స్పోర్ట్స్ అకాడమీ కలిసి పనిచేస్తుందని కేటీఆర్​ తెలిపారు.

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 క్రీడా మైదానాలు నిర్మించామని... వాటిలో ఇప్పటికే 50 నిర్మాణాలు పూర్తయ్యాయని... శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను క్రీడలు వృద్ధి చేసేందుకు ఉపయోగించాలని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి అనంతరం పరిశ్రమలు, క్రీడలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.