YSR Pensions Distribution: అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ శ్రమిస్తున్నామని మంత్రులు అన్నారు. పలు జిల్లాల్లో పింఛన్ పెంపుదల పంపిణీ కార్యక్రమాల్లో పాాల్గొన్న మంత్రులు, ఎంపీలు.. అర్హులకు పెరిగిన పింఛన్‌ను అందజేశారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన పింఛన్ పెంపుదల పంపిణీ కార్యక్రమంలో.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 95 శాతం పూర్తి చేశారని ధర్మాన వెల్లడించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పెరిగిన పెంఛన్‌ను లబ్ధిదారులకు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యనించారు.
పెంచిన పింఛన్ కానుకను రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు కన్నబాబు, విశ్వరూప్ లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను అందించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో.. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు.
పింఛన్ పెంపుదలపై ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పింఛన్ల కోసం ఏడాదికి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి :
CM Jagan At YSR Pension: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్