ETV Bharat / city

లోకేశ్​ను పరామర్శించే రోజులు దగ్గర్లో ఉన్నాయి: మంత్రి వెల్లంపల్లి - త్వరలో నారా లోకేశ్​ను పరామర్శించే రోజులు వస్తాయి

జేసీ ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలు చేయడం వల్లే ప్రభుత్వం అరెస్టు చేసిందని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన నడుస్తుందని లోకేశ్ చేసిన విమర్శలపై మండిపడ్డ ఆయన...జగన్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు లోకేశ్​కు లేదన్నారు.

త్వరలో నారా లోకేశ్​ను పరామర్శించే రోజులు వస్తాయి: మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Jun 26, 2020, 8:50 PM IST

ఈఎస్​ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తన పేరును ఎక్కడ బయటపెడతారోననే భయంతోనే...శ్రీకాకుళానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని నారా లోకేశ్​ పరామర్శించారని వైకాపా విమర్శించింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్​ బాధితులను పరామర్శించని లోకేశ్...పార్టీ నేతల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లటంలో అంతరార్థం ఇదేనని వెల్లంపల్లి అన్నారు. జేసీ ప్రభాకర్​రెడ్డి, అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలు చేయడం వల్లే ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. తప్పు చేసినవారిని జగన్ ప్రభుత్వం వదలిపెట్టదన్నారు. త్వరలో నారా లోకేశ్​ను కూడా తెదేపా నేతలు పరామర్శించే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రాజారెడ్డి పాలన నడుస్తుందని లోకేశ్ చేసిన విమర్శలపై మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. వైఎస్ జగన్ సహా ఆయన కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు లోకేశ్​కు లేదన్నారు. అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తుందన్న లోకేష్ ఆరోపణలను మంత్రి ఖండించారు. హత్యా రాజకీయాలు చేసేది చంద్రబాబేనన్న సంగతి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సీఎం జగన్ బాహుబలి అని.. మీరంతా కాళకేయులేనని లోకేష్ సహా తెదేపా నేతలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.