Minister Perni Nani News: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఎంపిక విషయంలో అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రికో లేక ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్నిపేర్ని నాని తప్పుపట్టారు. ఆయన చెప్పుతో ఆయన్ను కొట్టుకుంటే వివాదం పరిష్కారమవుతుందా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేయడానికే కొత్తపల్లి ఈ ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకున్నారని నిలదీశారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
సభలో చెప్పుతో కొట్టుకున్న వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.. కారణం ఇదే!