ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వం చాలాకాలం తనవద్దే ఉంచుకుందన్నదనేది అపోహేనని రాష్ట్ర సమాచార, పౌరసరఫరాల శాఖ మంత్రి పేర్ని నాని(Minister Perni nani) తెలిపారు. ఏ రోజు వచ్చిన డబ్బు ఆ మార్నాడే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ఖాతాల్లో జమ అవుతున్నట్లు చెప్పారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్నినాని.. విజయవాడ(Vijayawada)లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ టికెట్ విధానంపై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ కోసం కంప్యూటర్ల ఏర్పాటు, నిర్వహణ చిన్న సినిమా హాళ్లకు భారమవుతుందని ప్రభుత్వమే వాటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. టికెట్ ధరలపై ఇచ్చిన జీవో వల్ల చిన్నపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లను నడపడం కష్టమవుతోందని చెప్పారు. టికెట్ ధరలు పెంచాకే ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి