ETV Bharat / city

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వారం రోజుల్లో మార్చాలి: మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి తాజా వార్తలు

ప్రజలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్​ను అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని ఇంధన శాఖ మంత్రి రామచంద్రారెడ్డి సూచించారు. విద్యుత్ చౌర్యాలను పూర్తిస్థాయిలో అరికట్టడం, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యలను నియత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వారం రోజుల్లో మార్చాలి

author img

By

Published : Apr 26, 2022, 5:30 PM IST

విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు డిస్కంలు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ మంత్రి రామచంద్రారెడ్డి సూచించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో డిస్కంల పాత్ర కీలకమైందన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్​ను అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని కోరారు. విద్యుత్ చౌర్యాలను పూర్తిస్థాయిలో అరికట్టడం, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యలను నియత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు విద్యుత్ అందించే ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోతే తక్షణం స్పందించాలని.., అధిక జాప్యం వల్ల పంటనష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. రోజుల తరబడి ట్రాన్స్​ఫార్మర్లు మార్చడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని.. వారం రోజుల్లోగా కాలిపోయిన ట్రాన్స్​పార్మర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ట్రాన్స్​ఫార్మర్ల​ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. ట్రాన్స్​ఫార్మర్లు ఫెయిల్యూర్ రేటును మరింత తగ్గించాలన్నారు. క్వాలిటీ టెస్టింగ్, సీపీఆర్ఐ డిజైన్లు, నిబంధనల ప్రకారం పరీక్షించిన తరువాతే ట్రాన్స్​ఫార్మర్లు కొనుగోలు చేయాలని సూచించారు. ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు.

జగనన్న కాలనీలు సీఎం జగన్ మానస పుత్రికలని, కాలనీలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. జగనన్న కాలనీలకు ఫేజ్ -1 కింద 10,067 లే అవుట్లలోని 14.80 లక్షల ప్లాట్లకు రూ.4,500 కోట్లతో విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పనుల విషయంలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అధికారులు మంత్రికి వివరించారు. ఆర్డీఎస్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి 46.41 లక్షల మీటర్లు బిగించాల్సి ఉందని వివరించారు. 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల మీటర్లను బిగించాల్సి ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడికి చర్యలు: ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు త్వరలోనే సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో అటవీ, పోలీస్ అధికారులతో ఎర్రచందనం అక్రమ రవాణా నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అనుమతి కోరామని.. అమ్మకాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు.

"ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌ల్లో ఎర్రచందనంపై పటిష్ట నిఘా. ఆధునిక సాంకేతికతతో ఎర్రచందనం రవాణా అరికడతాం. టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తాం, సిబ్బంది కొరత లేకుండా చూస్తాం. త్వరలో కర్ణాటక, తమిళనాడు పోలీసు, అటవీశాఖతో సమన్వయ భేటీ. రాష్ట్రంలో ప్రస్తుతం 5,376 టన్నుల సీజ్ చేసిన ఎర్రచందనం. ఎర్రచందనం విక్రయానికి సీఐటీఈఎస్‌ అనుమతి కోరాం. ఎర్రచందనం విక్రయంతో రాష్ట్రానికి భారీగా ఆదాయం." -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి

ఇదీ చదవండి: 'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్​కు పీకే ఝలక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.