ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిలుపుదలపై హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యకలాపాలకు కోడ్ అడ్డు కాకూడదని త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎన్నికలకు భయపడి పారిపోయిన తెదేపా, ఓడిపోతామని తెలిసి నామమాత్ర స్థానాలకు పోటీ చేస్తున్న భాజపా, జనసేనలు రాష్ట్రంలో పోలింగ్ జరుగకుండా అడ్డుకుంటున్నాయని కొడాలి నాని ఆరోపించారు. హౌస్ మోషన్ పిటిషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: