ETV Bharat / city

Kodali: 'దిశ చట్టంలో లోపాలు సరిదిద్ది మరింత కఠినంగా అమలు చేస్తాం' - మంత్రి కొడాలి నాని వార్తలు

మహిళలపై దాడులు అరికట్టేందుకే దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చామని మంత్రి కొడాలి నాని అన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం అమల్లో చిన్న చిన్న లోపాలుంటే సరిదిద్ది మరింత కఠినంగా చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

minister kodali nani comments on disha app

author img

By

Published : Aug 17, 2021, 8:15 PM IST

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం అమల్లో చిన్న చిన్న లోపాలుంటే సరిదిద్ది మరింత కఠినంగా అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మహిళలపై దాడులు అరికట్టేందుకే దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. మహిళలపై దాడి ఘటనల్లో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు.

గుంటూరు జిల్లాలో యువతిని హత్య చేసిన నిందితుడిని 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు శవ రాజకీయాలకు తెరలేపారని మంత్రి కొడాలి మండిపడ్డారు.

ఇదీ చదవండి

Lokesh Kurnool Tour: చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.