Minister Kannababu On Hero Nani Comments: సినిమా టికెట్ల ధరలు నియంత్రించడం తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి కన్నబాబు అన్నారు. థియేటర్లలో టికెట్ల ధరలు, పార్కింగ్, తినుబండారాల రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారన్నారు. సినీ హీరో నాని వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లా ? అని ప్రశ్నించారు. నటుడు నాని వ్యాఖ్యలకు తనకు అర్థం తెలియరాలేదన్నారు. థియేటర్లలో తనిఖీలు లేకపోతే పరిశుభ్రత ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు.
నాని ఏమన్నారంటే..
Nani about AP Tickets issue: ఏపీలో సినిమా టికెట్ల విషయమై సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హీరో నాని తప్పుబట్టారు. టికెట్ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.
"(టికెట్ రేట్ల విషయంలో) ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే (డిసెంబర్ 24) సినిమా రిలీజ్ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది."
- నాని, హీరో
ఇదీ చదవండి
RAIDS IN CINEMA THEATERS : సినిమా హాళ్లలో తనిఖీలు.. ఆ థియేటర్ల మూసివేత