ETV Bharat / city

Minister Gowtham Reddy: '3 మేజర్ ప్రాజెక్టులు, 11 ఫిషింగ్ హార్బర్లకు నిధులు కోరాం' - ఏపీలో పోర్టుల అభివృద్దిపై చర్చ

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మేజర్ పోర్టుపై (major ports) కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్​తో చర్చించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి (Minister gowtham reddy meet central minister sonowal) స్పష్టం చేశారు. పోర్టుకు సంబంధించిన ప్రతిపాదన ఇవ్వాలని సూచించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 3 మేజర్ ప్రాజెక్టులు, 11 ఫిషింగ్ హార్బర్లకు కేంద్రాన్ని నిధులు కోరాం

author img

By

Published : Nov 12, 2021, 3:29 PM IST

Updated : Nov 12, 2021, 8:58 PM IST

దిల్లీలో కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌తో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి (Minister gowtham reddy meet central minister sonowal) భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మేజర్ పోర్టుపై (major ports) కేంద్రమంత్రితో చర్చించినట్లు గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు. పోర్టుకు సంబంధించిన ప్రతిపాదన ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు.

2030 నాటికి మెుత్తం ఎగుమతుల్లో (Exports) ఏపీ నుంచే 20 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని.. నెల క్రితం విజయవాడలో నిర్వహించిన ఎగుమతుల ప్రమోషన్ కార్యక్రమం విజయవంతమైనట్లు చెప్పారు. రాష్ట్రంలోని 3 మేజర్ ప్రాజెక్టులు (major projects) , 11 ఫిషింగ్ హార్బర్లకు (fishing harbor) కేంద్రమంత్రిని నిధులు కోరామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

సోలార్ ప్యానెల్ పరిశ్రమల ఏర్పాటుకు వినతి

కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌తో (Central minister RK Singh) మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో సోలార్ ప్యానెల్ పరిశ్రమల (solar panel plant) ఏర్పాటుకు కేంద్రమంత్రికి విన్నవించారు. కోల్‌ ఇండియా (coal india) సాయంతో మన్నవరం, కొప్పర్తిలో 3 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమలకు అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని మంత్రి గౌతమ్​ రెడ్డి వెల్లడించారు. కోల్‌ ఇండియా తరఫున 4 గిగా హెర్ట్జ్‌ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రమంత్రిని విన్నవించామన్నారు.

ప్రపంచ ఆర్థిక సమాఖ్య అధ్యక్షుడు బోర్జ్ బ్రెండ్‌తో భేటీ..

ప్రపంచ ఆర్థిక సమాఖ్య అధ్యక్షుడు బోర్జ్ బ్రెండ్‌ను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిల్లీలో కలిశారు. ఏపీలో అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి విధానాలను మంత్రి ఆయనకు వివరించారు. పారిశ్రామిక విధానం, అభివృద్ధి వికేంద్రీకరణపై బోర్జ్‌కు వివరించినట్లు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వేళ ఏపీ తీసుకున్న చర్యలను బోర్జ్ కొనియాడారన్నారు. ఈసారి 'వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్' పేరుతో డబ్ల్యూఈఎఫ్ భేటీ జరగనున్నట్లు మంత్రి తెలిపారు. జనవరిలో జరిగే దావోస్‌ సదస్సుకు సీఎంను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

APERC : "బిల్లులు చెల్లించకపోతే.. ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తాం"

Last Updated : Nov 12, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.