ETV Bharat / city

లక్షల కోట్ల అప్పులు చేసి.. మా జేబుల్లో పెట్టుకుంటున్నామా? : మంత్రి బొత్స - మంత్రి బొత్స తాజా వార్తలు

విద్యుత్ ఛార్జీలపై ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉన్నాయని.. వాటిని పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు పరిశీలించాక నిర్ణయం

author img

By

Published : Mar 31, 2022, 5:42 PM IST

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ బొత్స.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. బషీర్​బాగ్​ కాల్పులు చంద్రబాబు హయాంలోనే జరిగాయని అప్పట్లో జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారన్నారు.

ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందన్న తెదేపా ఆరోపణలపై స్పందించిన బొత్స.. లక్షల కోట్ల అప్పులు చేసి మా జేబుల్లో పెట్టుకుంటున్నామా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ లెక్కలుంటాయని తెలిపారు. మూడేళ్లలో లక్షా 30 వేల కోట్లను డైరెక్ట్ అకౌంట్ల ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేశామని తెలిపారు. ఉద్యోగులు జీతభత్యాల కింద రూ.45 వేల కోట్లు ఇస్తున్నది వాస్తవం కాదా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.

ఇదీ చదవండి: "చేతికో కర్ర, ఇంటికో లాంతరు పథకం తెస్తారు.."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.