ETV Bharat / city

Botsa: 'హెడ్డింగ్​లు మారినా.. నా భావాలు తెలిపినందుకు ధన్యవాదాలు'

Botsa Comments: విధాన నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఉపాధ్యాయులకు లేదంటూ సోమవారం తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించుకున్నారు. హెడ్డింగ్​లు అటు ఇటు మారినా.. తన భావాలను ప్రజలకు తెలిపారంటూ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

మీడియాకు ధన్యవాదాలు
మీడియాకు ధన్యవాదాలు
author img

By

Published : Jul 26, 2022, 5:15 PM IST

Updated : Jul 27, 2022, 7:38 AM IST

‘ఉపాధ్యాయులకు ఇచ్చిన 8 గంటలు వారు ఎందుకు పని చేయరు? ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల మనసులో ఏం ఆలోచన ఉందో నాకేం తెలుసు? టీచర్లకు ఉద్యోగరీత్యా ఇబ్బంది వస్తే సరిచేస్తాం. అంతేగానీ పాఠశాలల విలీన విధానమే తప్పంటే ఎలా? ఇంకో విధానం చెప్పాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘పాఠశాలల విలీనంపై కమ్యూనిస్టు ఎమ్మెల్సీలే బస్సు యాత్ర చేస్తున్నారు.. మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే కుదరదు.. ఎక్కడ బెదిరించాలో.. ఎక్కడ తగ్గాలో చూడాలి. 100శాతం ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకునే విలీనం, హేతుబద్ధీకరణ చేస్తున్నాం. ఉపాధ్యాయులు అడిగితే హేతుబద్ధీకరణ జీవో-117ను సవరించి జీవో-128 ఇచ్చాం. ఉపాధ్యాయులు చెప్పిన దాంట్లో సమంజసంగా ఉన్నవాటినే చూస్తాం. విలీన విధానం వద్దంటే ఎలా? ఇంకో విధానం చెప్పమనండి? ప్రతి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలని నేనే చెప్పాను. ఏ సంఘ నాయకుడినైనా తీసుకువచ్చి వారు చెప్పిన సవరణలు చేయలేదని చెప్పించండి.. నేను తల దించుకుంటాను. పాఠశాలల విలీనాన్ని తల్లిదండ్రులు అందరూ అంగీకరిస్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినచోట.. రహదారులు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వచ్చినచోట అభ్యంతరం తెలుపుతున్నారు. అలాంటిచోట మారుస్తాం. విలీనంపై అభ్యంతరాల స్వీకరణకు నేనే ఎమ్మెల్యేలకు లేఖలు రాశాను. తెదేపా ఎమ్మెల్యేల నుంచి లేఖలు వచ్చాయి. వాటిని పరిశీలిస్తాం. 5,800 పాఠశాలలను మ్యాపింగ్‌ చేస్తే 400 పాఠశాలలపై అభ్యంతరాలు వచ్చాయి. అంటే మిగతావి బాగున్నట్టే కదా? అభ్యంతరాలపై జేసీల ఆధ్వర్యంలో కమిటీలు వేశాం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. పాఠశాలల భవనాలు పడిపోయి ఉన్నాయంటే దానికి కారణం గతంలో సీఎంగా చేసిన చంద్రబాబే. మూడోతరగతి వారికి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన వద్దని చంద్రబాబు చెబుతారేమో చెప్పమనండి. మీడియాను అభ్యర్థిస్తున్నా. వ్యవస్థను బాగు చేయడానికి ప్రయత్నించండి. చిన్నాభిన్నం చేయొద్దు. తప్పుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఉద్యమాలు చేస్తున్న టీచర్లు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని ప్రశ్నించిన అంశాలు మీడియాలో వచ్చాయి. మీడియా కథనాలపై ఈఏపీసెట్‌ ఫలితాల సమావేశంలో బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హెడ్డింగ్​లు అటు ఇటు మారినా తన భావాలను ప్రజలకు తెలిపారంటూ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

బొత్స ఏమన్నారంటే..: ప్రభుత్వ విధానాలను ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని, ఉద్యోగరీత్యా విధుల్లో ఇబ్బందులొస్తే వాటిపైనే మాట్లాడాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఉద్యమాలు చేస్తున్న టీచర్లు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు ? ప్రైవేటు బడుల్లో ఎందుకు చేర్పిస్తున్నారు ? ప్రభుత్వ బడుల్లో చేర్పించొచ్చు కదా ? అని ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'మన పిల్లలు బాగా చదువుకోవాలి. కానీ పేద పిల్లలు పేదలుగానే ఉండాలా ? వారు మన దగ్గరకు వచ్చి ఊడిగం చేస్తూ ఉండాలా ? ప్రజల సంక్షేమం చూడటం ప్రభుత్వ లక్ష్యం. డబ్బులున్న పిల్లలు చదువుతున్న ఎల్‌కేజీ, యూకేజీ విధానాన్ని గ్రామీణ పేదలకూ అందించాలన్నదే ప్రభుత్వ విధానం. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచరుతో బోధన చేయిస్తున్నాం. దిల్లీలో విద్యా విధానం ఎందుకు అందరూ బాగుందంటున్నారు ? కేరళలో ఎందుకు 100 శాతం అక్షరాస్యత ఉంది ? ఆంధ్ర ఎందుకు వెనుకబడి ఉంది. ఎందుకు ముందు ఉండకూడదు ? సంస్కరణ ఫలితాలు వచ్చేందుకు మూడు, నాలుగేళ్లు పడుతుంది. ప్రస్తుతం చాలాచోట్ల 1- 5 తరగతులకు ఒకే గది, ఒకే టీచరు ఉన్న పరిస్థితులున్నాయి. వీటిలో మార్పు తీసుకొస్తున్నాం. 3, 4, 5 తరగతుల విలీనం కారణంగా సామాజిక సమానత్వం వస్తుంది. రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నారు. 5,200 బడులు మ్యాపింగ్‌ చేస్తే కేవలం 300 వాటిల్లోనే సమస్యలు వచ్చాయి. వీటిపై పరిశీలనకు కమిటీలు వేశాం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 27, 2022, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.