మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మత బోధకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
విజయవాడలో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఖాజా బాబా ఆశ్రమంలో.. మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా పాల్గోని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం మహ్మద్ ప్రవక్త జెండాను ఆవిష్కరించారు. హిందు, ముస్లిం ఐక్యత చాటిచెప్పే పర్వదినం.. మీలాద్ ఉన్ నబి అని ఎమ్మెల్యే అన్నారు. హిందు, ముస్లిం మైనారిటీ సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వం తమదని కరీమున్నీసా అన్నారు.
గుడివాడలో..
గుడివాడ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులు.. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గుడివాడ పట్టణ పురవీధులలో భారీ ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో
ప్రతి ముస్లిం సోదరుడు మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడిచి.. ఆయన కలలు కన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో మంగళవారం ముస్లింలు.. అత్యంత భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబి వేడుకలను జరుపుకున్నారు.
హిందూపురం, కదిరిలో
హిందూపురం, కదిరి పట్టణాల్లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా.. ముస్లింలు శాంతి ర్యాలీని నిర్వహించారు. గౌసియా మజీద్ ఆధ్వర్యంలో.. శాంతి ర్యాలీ చేపట్టారు. కదిరిలో ముస్లిం సోదరులు భారీ ప్రదర్శన చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు మసీదులు, దర్గాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
కడప జిల్లాలో
ప్రతి ఒక్కరు మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. మహమ్మద్ ప్రవక్త చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
జమ్మలమడుగులో
జమ్మలమడుగు పట్టణంలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా.. ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త చూపిన మార్గంలో అందరు నడవాలని, సర్వమత సమ్మేళనంలో కలిసిమెలిసి జీవించాలని ముస్లిం పీఠాధిపతులు సూచించారు.
ఇదీ చదవండి: