ETV Bharat / city

ఎంబీబీఎస్, బీడీఎస్ బీ, సీ కేటగిరీల సీట్లకు నేడు కౌన్సెలింగ్ - ఏపీ ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బీ, సీ కేటగిరీ కౌన్సెలింగ్ ప్రారంభం

ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య బీ, సీ కేటగిరీలో ప్రవేశానికి మొదటి విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో విద్యను అభ్యసించేందుకు.. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 1 వరకు అభ్యర్థులు వెబ్​ ఆప్షన్లు ఎంచుకోవాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.

medical colleges counselling
ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
author img

By

Published : Dec 20, 2020, 7:11 AM IST

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య బీ, సీ కేటగిరీ సీట్ల ప్రవేశానికి.. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 1 వరకు.. అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్ల కసరత్తు పూర్తిచేయాల్సి ఉంటుందని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. ఎంబీబీఎస్‌ ‘బీ’ కేటగిరీలో 886, ముస్లిం మైనార్టీలో 87, ముస్లిం మైనార్టీ కళాశాలలో 38 సీట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. బీడీఎస్‌ కోర్సులో బీ కేటగిరీలో 454 సీట్లు, సీ కేటగిరీలో 196 సీట్లు ఉన్నాయి.

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల రెండవ విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఇప్పటికే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన 175 సీట్లతో పాటు ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడా విభాగాలకు చెందిన 179 ప్రత్యేక కేటగిరీ సీట్లనూ కలిపి భర్తీ చేయనున్నారు.

ఇదీ చదవండి:

అప్పటి వరకూ దివిస్ నిర్మాణం జరగదు: గౌతమ్​రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.