ETV Bharat / city

తెలంగాణలో 20 ఏళ్ల క్రితం సైకిల్ చోరీ..‌ తాజాగా రికవరీ - సైకిల్ వార్తలు

'గట్టిగా అనుకో అయిపోతుందిలే' అని ఓ సినిమాలో హీరోయిన్ అంటుంది. మరి అతను ఎంత గట్టిగా కోరుకున్నాడో... 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన సైకిల్ అతని చెంతకు చేరుకుంది. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో జరిగింది.

man received his bicycle after after 20 years at adilabad
తెలంగాణలో 20ఏళ్ల క్రితం సైకిల్ చోరీ..‌ తాజాగా రికవరీ..
author img

By

Published : Jan 3, 2021, 1:57 PM IST

20 ఏళ్ల క్రితం దొంగలు ఎత్తుకుపోయిన సైకిల్‌ తిరిగి యజమాని చెంతకు చేరిన ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఉట్నూరు మండలం వేణునగర్‌కు చెందిన గజానంద్‌ సైకిల్‌.. 20 ఏళ్ల క్రితం చోరీకి గురైంది. అప్పుడు గజానంద్‌ ఆర్డీవో కార్యాలయంలో బంట్రోతుగా విధులు నిర్వర్తించేవారు.

సైకిల్‌ పోయిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేశారు. 2004లో ఈ కేసులు కోర్టు మూసివేసింది. ఈ మధ్య పాతకేసులను తీసిన కోర్టు... ఆస్తులను బాధితులకు అప్పజెప్పాలని ఆదేశించింది. శనివారం ఉట్నూరు కోర్టు గజానంద్‌ను పిలిచి అతడికి సైకిల్‌ను అప్పజెప్పింది.

ఇదీ చూడండి:

రాజధాని అమరావతి గ్రామాలు.. మున్సిపాలిటీల పరిధిలోకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.