అప్పుల బాధతో ఓ వ్యక్తి బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్కింగ్ సమీపంలో చోటు చేసుకుంది. అనంతరం హాహాకారాలు చేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు నెల్లూరుకు చెందిన ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. తాను పని చేస్తోన్న సిమెంట్ ఇటుకల వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతో ఆత్యహత్యాయత్నం చేసినట్లు ప్రశాంత్ వెల్లడించాడు.
ఇవీ చూడండి :