ETV Bharat / city

నకిలీ చలానాల వ్యవహారం... ప్రధాన నిందితుడు అరెస్టు - mandavalli crime

కృష్ణా జిల్లా మండవల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 450 చలానాలకు సంబంధించి... రూ.1.02కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించినట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు.

నకిలీ చలానాల వ్యవహారం... ప్రధాన నిందితుడు అరెస్టు

author img

By

Published : Aug 26, 2021, 7:40 PM IST

కృష్ణాజిల్లా మండవల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలనాల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంపు వెండర్ ధీరజ్​ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. కైకలూరు టౌన్ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. 640 నకిలీ చలానాలలో 450 చలానాలకు సంబంధించి రూ.1.02కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఏం జరిగిందంటే...

కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో ఒకే ఒక్క డాక్యుమెంట్‌ రైటర్‌ ఉన్నారు. ఆయనే స్థిరాస్తి లావాదేవీలు చూస్తారు. అందరూ ఆయన దగ్గరే దస్తావేజులు రాయించుకుంటారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ పరిచయాలతో పనులు చేయిస్తుంటారు. మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చాలా తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. ఏడాదికి ఇక్కడ ఆదాయమే రూ.9 కోట్లు ఉంటుంది. అలాంటిది ఒకే ఏడాది డాక్యుమెంటు రైటర్‌ ప్రభుత్వ ఆదాయానికి రూ.2.5కోట్లు గండి కొట్టారు. ప్రస్తుతం వసూలుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు 258 మంది క్రయదారులు డాక్యుమెంట్‌ రైటర్‌ చుట్టూ తిరుగుతున్నారు. వీరందరికి నోటీసులు జారీ అయ్యాయి.

మార్ఫింగ్ చేసి నకిలీ చలానాల సృష్టి...

పూర్తి స్థాయిలో స్టాంపు రుసుము చెల్లిస్తేనే ఆ డాక్యుమెంటు చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కనీసం 10శాతం సొమ్ము కూడా చెల్లించలేదు. రూ.లక్ష చెల్లించాల్సిన వారి పేరుతో రూ.10 వేలు చొప్పున మాత్రమే చెల్లించి దాన్ని మార్ఫింగ్‌ చేసి నకిలీ ఈ చలానాను అప్‌లోడ్‌ చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ విదానంలో బురిడీ కొట్టించారు. ఈ విధంగా దాదాపు రూ.2.50 కోట్లు స్వాహా చేశారు. దీనిలో క్రయదారుల పాత్ర లేకపోయినా ప్రస్తుతం బాధితులు వారే. డాక్యుమెంట్‌ రైటర్‌ చెల్లించకపోయినా ముందుగా దస్తావేజులు పొందిన యజమానులు ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1.22 కోట్లు చెల్లింపు!
పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లు రూ.1.22కోట్లు చెల్లించారు. ఇక్కడ పూర్తిగా చెల్లించడం విశేషం. కొన్నేళ్లుగా దస్తావేజుల లేఖర్లుగా గుర్తింపు పొందిన వీరు ఈ కుంభకోణం వెలుగు చూడడంతోనే మొత్తం చెల్లింపులు చేయడం గమనార్హం. వాస్తవానికి పటమట కేంద్రంగానే ఈ నకిలీ ఈ చలానా కుంభకోణం విస్తరించిందని చెబుతున్నారు. అన్ని రకాల అక్రమాలు పటమట కేంద్రంగా జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. మొత్తానికి జిల్లాలో రూ.4.2 కోట్లు రుసుము స్వాహా అయినట్లు పరిశీలనలో తేలగా ఇప్పటి వరకు రూ.1.86 కోట్లు చెల్లింపులు జరిపారు. ఒక్క మండవల్లి మినహా అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో జరిగాయి.

అనుబంధ కథనం

ILLEGAL EARNING: తండ్రి స్థానంలో కూర్చొని.. ఏడాదిలో రూ.కోట్లు కాజేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.