ETV Bharat / city

గాంధీ 150: మహాత్ముడు జాతీయ పతాకాన్ని ఆమోదించింది ఇక్కడే!

తెలుగు నేలపై... జాతిపిత మహాత్మగాంధీ జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతో బాపూజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్ర వాణిజ్య రాజధాని... అప్పటి బెజవాడతో మహాత్ముడికి విడదీయరాని బంధం ఉంది. 6సార్లు ఆయన విజయవాడ నగరాన్ని సందర్శించి... ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చారు. 1919, 1920,1921,1929,1937,1946 సంవత్సరాల్లో గాంధీజీ బెజవాడలో పర్యటించారు. తొలిసారి వచ్చినప్పుడు సత్యాగ్రహంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునివ్వడంతో... దాదాపు 6వేల మంది ఉద్యమకారులు జాతిపితకు మద్ధతుగా నిలిచారు.

Mahatma Gandhi Relation with Vijayawada
author img

By

Published : Sep 24, 2019, 7:01 AM IST

మహాత్ముడు జాతీయ పతాకాన్ని ఆమోదించింది ఇక్కడే!

జాతీయోద్యమం గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మహాత్మగాంధీ దేశమంతా పర్యటించారు. ఆ పర్యటనల్లో భాగంగా ఆరు సార్లు బెజవాడకు వచ్చారు. గాంధీజీ పర్యటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడోది. ఆ పర్యటనలోనే సహాయ నిరాకణోద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఎంతో మంది... బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సత్కారాలు, బిరుదులు, ఉన్నతోద్యాగాలు వదులుకున్నారు. అప్పుడే.. అయ్యదేవర కాళేశ్వరరావు... తనకు ఇచ్చిన దేశోద్ధారక బిరుదును తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రరప్రదేశ్ మొదటి స్పీకర్ అయ్యారు.

1921లో వారం పాటు బస

1921లో వారం రోజులపాటు మహాత్ముడు విజయవాడలో బస చేశారు. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది కూడా ఆ సమయంలోనే. ప్రస్తుత బందరు రోడ్డులోని బాపు మ్యూజియంలో ఆ సమావేశం జరిగింది. అప్పుడే పింగళి వెంకయ్య... దేశం కోసం రూపొందించిన మువ్వన్నెల పతాకాన్ని గాంధీజీకి అందించారు. దాన్ని ఆయన ఆమోదించారు. ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా వచ్చారు.

1929లో ఖద్దరు యాత్ర కోసం...

1929లో ఖద్దరు యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చేందుకు బాపూ బెజవాడకు వచ్చారు. స్వదేశీ వస్త్రాలనే ధరించాలి... వాటిని మనమే రూపొందించాలంటూ సాగిన ఆ యాత్రకు విశేష స్పందన వచ్చింది. 1937లో గంటూరు జిల్లాలో పెను ఉప్పెన వచ్చింది. అప్పుడు బాధితులను పరామర్శించేందుకు గాంధీజీ బెజవాడ వచ్చారు. చివరిగా 1946వ సంవత్సరం జనవరి 26న హిందీ ప్రచారయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చారు. మహాత్ముడు బెజవాడకు వస్తున్నారని తెలిసి... లక్షల సంఖ్యలో జనం రైల్వేస్టేషన్​కు తరలివెళ్లారు. ఆ రోజు బాపూజీ మౌనవ్రతంలో ఉండడం వల్ల కేవలం అభివాదం చేసి వెళ్లిపోయారు.

రైల్వే స్టేషన్ సమీపంలోని కొండకు గాంధీ హిల్ పేరు

మహాత్మాగాంధీకి బెజవాడతో ఉన్న అనుబంధాన్ని తరతరాలు గుర్తించుకునే విధంగా రైల్వేస్టేషన్ సమీపంలోని కొండకు గాంధీ హిల్ అని అప్పటి రాష్ట్రపతి జకిర్ హుస్సేన్ నామకరణం చేశారు. ఆ గాంధీ హిల్ ఇప్పటికి కూడా చారిత్రక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం గుర్తుగా... పింగళి వెంకయ్య... గాంధీకి మువ్వన్నెల పతకాన్ని ఇచ్చిన సన్నివేశాన్ని కళ్లకుకట్టేలా ప్రస్తుత బాపు మ్యూజియంలో పాలరాతి శిల్పాలు ఏర్పాటు చేశారు.

Intro:Body:

‘    మహాత్ముడు  జాతీయ పతాకాన్ని  ఆమోదించింది ఇక్కడే...’! 

summary...

తెలుగు నేలపై... జాతిపిత మహాత్మగాంధీ జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతో బాపూజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్ర వాణిజ్య రాజధాని... అప్పటి బెజవాడతో మహాత్ముడికి విడదీయరాని బంధం ఉంది. 6సార్లు ఆయన విజయవాడ నగరాన్ని సందర్శించి... ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చారు. 1919, 1920,1921,1929,1937,1946 సంవత్సరాల్లో గాంధీజీ బెజవాడలో పర్యటించారు. తొలిసారి వచ్చినప్పుడు సత్యాగ్రహంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునివ్వడంతో... దాదాపు 6వేల మంది ఉద్యమకారులు జాతిపితకు మద్ధతుగా నిలిచారు. 

---

జాతీయోద్యమం గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మహాత్మగాంధీ దేశమంతా పర్యటించారు. ఆ పర్యటనల్లో భాగంగా ఆరు సార్లు బెజవాడకు వచ్చారు. గాంధీజీ పర్యటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడోది. ఆ పర్యటనలోనే సహాయ నిరాకణోద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఎంతో మంది... బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సత్కారాలు, బిరుదులు, ఉన్నతోద్యాగాలు వదులుకున్నారు.  అప్పుడే.. అయ్యదేవర కాళేశ్వరరావు... తనకు ఇచ్చిన దేశోద్ధారక బిరుదును తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రరప్రదేశ్ మొదటి స్పీకర్ అయ్యారు. 

1921లో వారం రోజులపాటు మహాత్ముడు విజయవాడలో బస చేశారు. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది కూడా ఆ సమయంలోనే. ప్రస్తుత బందరు రోడ్డులోని బాపు మ్యూజియంలో ఆ సమావేశం జరిగింది. అప్పుడే పింగళి వెంకయ్య... దేశం కోసం రూపొందించిన మువ్వన్నెల పతాకాన్ని గాంధీజీకి అందించారు. దాన్ని ఆయన ఆమోదించారు. ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా వచ్చారు. 

ఈమని శివనాగిరెడ్డి, విజయవాడ,అమరావతి సాంస్కృతిక కేంద్రం సీఈవో

1929లో ఖద్దరు యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చేందుకు బాపూ బెజవాడకు వచ్చారు. స్వదేశీ వస్త్రాలనే ధరించాలి... వాటిని మనమే రూపొందించాలంటూ సాగిన ఆ యాత్రకు విశేష స్పందన వచ్చింది. 1937లో గంటూరు జిల్లాలో పెను ఉప్పెన వచ్చింది. అప్పుడు బాధితులను పరామర్శించేందుకు గాంధీజీ బెజవాడ వచ్చారు. చివరిగా 1946వ సంవత్సరం జనవరి 26న హిందీ ప్రచారయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చారు. మహాత్ముడు బెజవాడకు వస్తున్నారని తెలిసి... లక్షల సంఖ్యలో జనం రైల్వేస్టేషన్​కు తరలివెళ్లారు. ఆ రోజు బాపూజీ మౌనవ్రతంలో ఉండడం వల్ల కేవలం అభివాదం చేసి వెళ్లిపోయారు.

మహాత్మాగాంధీకి బెజవాడతో ఉన్న అనుబంధాన్ని తరతరాలు గుర్తించుకునే విధంగా రైల్వేస్టేషన్ సమీపంలోని కొండకు గాంధీ హిల్ అని అప్పటి రాష్ట్రపతి జకిర్ హుస్సేన్ నామకరణం చేశారు. ఆ గాంధీ హిల్ ఇప్పటికి కూడా చారిత్రక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం గుర్తుగా... పింగళి వెంకయ్య... గాంధీకి మువ్వన్నెల పతకాన్ని ఇచ్చిన సన్నివేశాన్ని కళ్లకుకట్టేలా ప్రస్తుత బాపు మ్యూజియంలో పాలరాతి శిల్పాలు ఏర్పాటు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.