విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు ఆహారాన్ని అందించే సుభోజనం కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్దాస్ మాట్లాడుతూ... నిత్యం వేల మంది చికిత్స నిమిత్తం దూర ప్రాంతాల నుంచి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారన్నారు.
రోగులకు తోడుగా సహాయకులు వస్తుంటారని...వారికీ మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దాతల సహాయ సహకారాలతో ప్రస్తుతం సుమారు 200 మందికి నిత్యం ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్న ఆయన... భవిష్యత్తులో మరింతమందికి ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:
8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు