కరోనా సృష్టించిన సమస్యలను అధిగమించలేక అవస్థలు పడుతున్న రవాణా రంగానికి పెరిగిన ఇంధన ధరలు పెను శాపంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలతో లారీ యజమానులు బాడుగలకు తిప్పలేక, ఇంటి దగ్గర పెట్టుకోలేక సతమతమవుతున్నారు. అక్టోబర్ నెలలోనే 5 రూపాయలకు పైగా పెరిగిన డీజిల్ ధరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పన్నులతో ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా తమ పరిస్థితి మారిందని లారీ యజమానులు, డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చిన సమస్యలను పరిష్కరించటం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు స్పందించి తగు చర్యలు తీసుకుంటే...లారీలపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.