తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, నోటీసులివ్వకుండా జర్నలిస్ట్ శివ ప్రసాద్‌ను అరెస్టు చేశారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జర్నలిస్ట్ అక్రమ అరెస్టుని తెలంగాణ హై కోర్టు సుమోటోగా స్వీకరించిందని తెలిపారు. జరిగిన ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు శివప్రసాద్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారని చెప్పారు. జగన్‌ను మెప్పించేందుకు సీఐడీ తప్పుల మీద తప్పులు చేస్తుందని విమర్శించారు. చేస్తున్న తప్పులకు వైకాపా నాయకులు, వారు చెప్పినట్టు ఆడి.. అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు