హైదరాబాద్‌లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. వర్షాలతో నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరదముంపునకు గురయ్యాయని ఆయన తెలిపారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక బృందాలతో రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని కమిషనర్ అన్నారు. కావునా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, కొండవాలు ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలన్నారు. ఎటువంటి ఆసరా లేని వారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి :